Home  »  Bollywood News  »  డైరెక్టుగా ఓటీటీలో రిలీజ‌వుతున్న త‌మ‌న్నా మూవీ

Updated : Jul 20, 2022

 

త‌మ‌న్నా భాటియా టైటిల్ రోల్ పోషించిన బాలీవుడ్ మూవీ 'బ‌బ్లీ బౌన్స‌ర్‌'. మ‌ధుర్ భండార్క‌ర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 23న డైరెక్టుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్న‌ది. ఈ మేర‌కు ఆ సంస్థ బుధ‌వారం ప్ర‌క‌టించింది. కామెడీ మేళ‌వించిన నేటిత‌రం ఫీల్ గుడ్ స్టోరీతో ఈ మూవీని స్టార్ స్టూడియోస్‌, జంగ్లీ పిక్చ‌ర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

నార్త్ ఇండియా లోని అసోలా ఫ‌తేపూర్ అనే టౌన్ నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌లో ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త పాత్ర‌లో త‌మ‌న్నా క‌నిపించ‌నున్న‌ది. ఈ మూవీలో ఆమె బ‌బ్లీ అనే లేడీ బౌన్స‌ర్‌గా న‌టించింది. డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్ బ‌బ్లీ బౌన్స‌ర్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను త‌న అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది. "Here’s the first look of #BabliBouncer, starring the phenomenal @tamannaahspeaks Streaming from Sept 23 only on #DisneyPlusHotstarMultiplex". అంటూ ట్వీట్ చేసింది.

హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ 'బ‌బ్లీ బౌన్స‌ర్' రిలీజ‌వుతోంది. ఈ మూవీలో సౌర‌భ్ శుక్లా, అభిషేక్ బ‌జాజ్‌, సాహిల్ వైద్ కీల‌క పాత్ర‌లు చేశారు. కృతీ కుల్హ‌రి మెయిన్ లీడ్‌గా రూపొందించిన ఇందు స‌ర్కార్ (2017) త‌ర్వాత మ‌ధుర్ భండార్క‌ర్ డైరెక్ట్ చేసిన సినిమా ఇదే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.